Friday, September 3, 2010

నా కన్నీళ్లు ..
















నువ్వు నన్నొదిలి వెళ్తున్నావని నేను బాధపడినా,
నేను ఒంటరిని మాత్రం కాదు నేస్తం  ,
ఎందుకంటే నా  కన్నీళ్లు నాకు తోడున్నాయి,
నులివెచ్చగా ఓదార్పుని  ఇస్తున్నాయి..

ఈ రోజే తెలుస్తోంది నాకు ,
కన్నీళ్లు కూడా కమ్మగా ఉంటాయని ,
కన్నీళ్ళని మించిన చెలిమి లేదని,
కన్నీళ్ళకేమీ సరిరావని.

సుఖాల్లోనే కాదు కష్టాలలో కూడా ,
నేనున్నానంటూ ఆప్యాయం గా హత్తుకునే
కన్నీళ్లు ,నాకెప్పుడు దూరం కాకూడదు .

ఇది నేను కోల్పోతున్న ,
నీ తీయని చెలిమి  ఇస్తున్న ఉప్పటి వరమేమో కదా .
లేక నా దురదృష్టం నాకిచ్చిన విముక్తా ?

నేను దుఃఖం తో కుంగిపోను .,
ప్రక్కవారిలో వున్న దుఃఖాన్నిఅర్ధం చేస్కునే ఔదార్యం నాకుంది ..
నేను వాళ్ళ బాధల్ని తీర్చక పోవచ్చు, కానీ వాళ్ళ దుఃఖాన్ని అయితే తీర్చగలను,

నాకు తెలుసు ,

చెలిమిని కోల్పోయిన చెలిమికి , చెలిమిని మించిన చెలిమి మరొకటి లేదని .

4 comments:

  1. ఈ రోజే తెలుస్తోంది నాకు ,
    కన్నీళ్లు కూడా కమ్మగా ఉంటాయని ,
    కన్నీళ్ళని మించిన చెలిమి లేదని,
    కన్నీళ్ళకేమీ సరిరావని.
    చాలా బాగుంది .

    ReplyDelete
  2. @
    మస్తాన్ అన్నా ,
    భాస్కర్ భాయ్.,
    రాధిక అక్కా..
    మీ ముగ్గురికీ పే..ద్ద థాంక్స్ ..

    ReplyDelete